పెద్ద బస్ట్ కోసం బెటర్ స్పోర్ట్స్ బ్రా

A
Secret Desires

ఎక్సర్సిసెస్ చేసేవారికి సరైన బ్రాను కనుగొనడం ఒక సవాలుగా ఉంటుంది, ముఖ్యంగా పెద్ద బస్ట్లు ఉన్న మహిళలకు. సరైన స్పోర్ట్స్ బ్రాను ఎంచుకోవడం వలన మీరు కాన్ఫిడెంట్ మరియు ఇండిపెండెంట్ గా ఉండగలుగుతారు. అవి  మజ్ల్స్ మరియు భుజాలపై స్ట్రెస్ తగ్గిస్తాయి, మీరు ఆత్మ విశ్వాసంతో ఎక్సర్సిసెస్ చేయగలుగుతారు. ఈ బ్లాగ్‌లో, పెద్దబస్ట్ ల కోసం ఉత్తమ స్పోర్ట్స్ బ్రా గురించి మీకు సరి అయిన వివరాలు అందిస్తున్నాము.

వర్కౌట్ సమయంలో పెద్ద బస్ట్ లు ఉన్న మహిళలు ఎదుర్కొనే సాధారణ సమస్యలు

పెద్ద బస్ట్ల కోసం ఉత్తమ స్పోర్ట్స్ బ్రా గురించి మాట్లాడే ముందు,మహిళలు బ్రా ధరించేటప్పుడు ఎదుర్కొనే అనేక సమస్యలను నేను జాబితా చేయాలనుకుంటున్నాను.

1. తగిన సపోర్ట్ లేకపోవడం

బ్రా యొక్క ముఖ్య ఉద్దేశ్యం బస్ట్లకు మద్దతు ఇవ్వడం. పెద్ద చెస్ట్  ఉన్న స్త్రీలు బ్రా ధరించడం మానేస్తే, తగిన మద్దతు లేకపోవడం వల్ల భుజాలపై ఒత్తిడి ఏర్పడుతుంది మరియు సగ్గింగ్, అసౌకర్యం మరియు నొప్పి వస్తుంది.

2. బ్రా  స్టైల్స్ యొక్క అజ్ఞానం

ఈ రోజుల్లో అందుబాటులో ఉన్న వివిధ రకాల బ్రాల గురించి మనలో చాలా మందికి తెలియదు. పూర్తి కవరేజ్, ప్యాడెడ్, రేజర్‌బ్యాక్, సీమ్‌లెస్, ప్రింటెడ్ మరియు రిమూవబుల్ ప్యాడింగ్ పెద్ద బస్ట్ లు ఉన్న మహిళలకు ఉత్తమమైన బ్రా రకాలు.

3. శరీర షేప్ మరియు బస్ట్ రకం ఆధారంగా సరైన బ్రాను ఎంచుకోలేకపోవడం

ప్రతి బస్ట్  పరిమాణం, షేప్  శరీర టైప్ బట్టి మారుతుంది. బరువైన బస్ట్ల కోసం సరైన బ్రా ఎంచుకోవడం కొన్నిసార్లు కష్టం కావొచ్చు, కానీ మీకోసమే సరైన పరిష్కారాలను మేము అందించేందుకు ఇక్కడ ఉన్నాము. మీరు పూర్తి కవరేజీ బ్రాలు, పుష్-అప్ బ్రాలు, మినిమైజర్ బ్రాలు, అండర్‌వైర్ బ్రాలు, టీ-షర్ట్ బ్రాలు, స్పోర్ట్స్ బ్రాలు వంటి శైలులను ఎంచుకోవచ్చు, ఇవి ప్రతిసారీ మంచి సౌకర్యాన్ని అందిస్తాయి.

పెద్ద బస్ట్ ల కోసం ఉత్తమ స్పోర్ట్స్ బ్రాల జాబితా

క్వాలిటీ స్పోర్ట్స్ బ్రాలలో ఇన్వెస్ట్మెంట్ పెట్టడం అనేది వాటి సైజ్, ఫిట్ మరియు సపోర్ట్ వంటి వివిధ అంశాలపై ఆధారపడి ఉంటుంది. పెద్ద బస్ట్ ల కోసం ఉత్తమ స్పోర్ట్స్ బ్రా కోసం మా అగ్ర సిఫార్సులు క్రింది విధంగా ఉన్నాయి.

1. మీడియం ఇంపాక్ట్ స్పోర్ట్స్ బ్రాతో క్రాస్ బ్యాక్

బ్రా స్ట్రాప్ సమస్యలు ఎదుర్కొనే వారికి ఈ రకమైన బ్రా అత్యంత అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే ఈ బ్రాలో స్ట్రాప్స్ జారిపోకుండా ఉండే విధంగా రూపొందించబడ్డాయి. ఈ బ్రా బస్ట్కు పకడ్బందీగా సపోర్ట్ అందిస్తుంది, కదలికలను తగ్గిస్తుంది, మరియు వ్యాయామం లేదా రోజువారీ కార్యకలాపాలను చేయడంలో ఏ రకమైన అసౌకర్యం కలగకుండా సహాయపడుతుంది.

2. పూర్తి కవరేజీతో స్పోర్ట్స్ బ్రా 

మీ వ్యాయామం చేసే సమయంలో మీ బస్ట్  బ్రా నుండి బయటకు వస్తున్నట్లు అనిపిస్తే, పూర్తి కవరేజ్ స్పోర్ట్స్ బ్రాను ఎంచుకోండి. ఈ బ్రా రోజంతా సౌకర్యాన్ని మరియు సరైన సపోర్ట్  ఇస్తుంది. ఈ బ్రాను క్రాప్ టాప్ లేదా బ్రా టాప్‌లుగా కూడా ధరిస్తే ఆకర్షణీయంగా ఉంటుంది.

3. ఫ్రంట్ జిప్పర్‌తో హై-ఇంపాక్ట్ స్పోర్ట్స్ బ్రా

స్లిప్-ఆన్-స్టైల్ బ్రాలను ఇష్టపడని పెద్ద చెస్ట్ ఉన్న మహిళలు ఈ స్టైల్‌ను ప్రయత్నించవచ్చు. ఎందుకంటే ముందు భాగంలో ఉండే జిప్పర్ బస్ట్ కు మంచి సపోర్ట్ ఇస్తుంది. వెయిట్ లిఫ్టింగ్ మరియు రన్నింగ్ వంటి హై ఇంటెన్సిటీ యాక్టివిటీస్ చేస్తున్నప్పుడు మీరు ఈ స్టైల్ బ్రాలను ధరించవచ్చు.

4. మీడియం ఇంపాక్ట్ ప్యాడెడ్ స్పోర్ట్స్ బ్రా

ప్యాడెడ్ స్పోర్ట్స్ బ్రా అనేది అసమాన బస్ట్  ఉన్న ప్లస్-సైజ్ మహిళలకు అద్భుతమైన ఎంపిక. ఇది నిప్పుల్ తెలియకుండా ఉండేలా సహాయపడుతుంది. మూడు వరుసల హుక్స్‌తో స్టైల్‌లను ఎంచుకోవడం ఉత్తమం, మరియు మరియు నాన్ రిమూవల్ స్ట్రాప్స్ లాంగ్ లాస్టింగ్ సపోర్ట్ ఇస్తుంది

5. రేజర్‌బ్యాక్ కీహోల్‌తో స్పోర్ట్స్ బ్రా 

పెద్ద బస్ట్  ఉన్న మహిళలు ఈ రేసర్‌బ్యాక్ స్పోర్ట్స్ బ్రాను ఇష్టపడవచ్చు. ఎందుకంటే రేసర్‌బ్యాక్ మీ శరీరానికి దగ్గరగా సరిపోతుంది మరియు వర్కౌట్‌ల సమయంలో మీకు స్టైలిష్ లుక్‌ను అందిస్తుంది.

6. రేజర్‌బ్యాక్‌తో స్టీట్చ్స్ లేని స్పోర్ట్స్ బ్రా

స్టీట్చ్స్ లేని స్పోర్ట్స్ బ్రా అనేది బట్టల క్రింద కనిపించే గీతలను ఇష్టపడని వారి కోసం. మీరు అండర్‌వైర్ కప్పులతో కూడిన స్టీట్చ్స్ లేని స్టైల్ స్పోర్ట్స్ బ్రాను ధరించవచ్చు. ఈ స్టైల్‌ను టాప్‌గా లేదా లేయర్డ్‌గా స్పోర్ట్స్ జాకెట్‌తో కూడా ధరించవచ్చు.

7. రిమూవల్ పాడింగ్ స్పోర్ట్స్ బ్రా

రిమూవల్ పాడింగ్ కూడిన బ్రాలు అదనపు ప్రయోజనం, ఎందుకంటే అవి మన అవసరాలకు అనుగుణంగా ఉంటాయి. ఈ స్టైల్ స్పోర్ట్స్ బ్రా తక్కువ ఇంపాక్ట్ వర్కౌట్‌లకు సరైనది.

8. ఫుల్ కవరేజీతో హై-ఇంపాక్ట్ స్పోర్ట్స్ బ్రా

తీవ్రమైన వర్కౌట్‌ల సమయంలో మీ బస్ట్ కు ఎక్కువ మద్దతు అవసరం, కాబట్టి ఎక్కువ కవరేజీతో హై-ఇంపాక్ట్ స్పోర్ట్స్ బ్రాలను ఎంచుకోండి.  ఈ బ్రాలు తక్కువ బరువు కలిగి ఉంటాయి మరియు రక్షణను అందిస్తాయి కాబట్టి వాటిని ఎక్కువ కాలం సులభంగా ధరించవచ్చు.

9. లాంగ్‌లైన్ స్ట్రాపీ బ్యాక్‌తో స్పోర్ట్స్ బ్రా

లాంగ్‌లైన్ బ్రాలు స్కూప్ నెక్ మరియు రేజర్‌బ్యాక్‌తో వస్తాయి. ఈ ఫీచర్లు స్టైలిష్ లుక్, పూర్తి కవరేజ్ మరియు అన్ని శరీర రకాలకు సరిపోయే సపోర్ట్ ఇస్తుంది

10. రేసర్‌బ్యాక్‌తో ప్రింటెడ్ స్పోర్ట్స్ బ్రా

ప్రింటెడ్ స్పోర్ట్స్ బ్రాలు పెద్ద బస్ట్‌ల షేప్ తక్కువగా చూపిస్తాయి మరియు మంచి  సపోర్ట్  కూడా అందిస్తాయి. మీరు ఫ్యాన్సీ సాలిడ్ కలర్స్ ప్రిఫర్ చేయకపోతే, స్టైలిష్‌గా, అలాగే ఫంక్షనల్‌గా ఉండే ప్రింటెడ్ బ్రాలను ఎంచుకోవచ్చు.

పెద్ద చెస్ట్  ఉన్న మహిళలకు స్పోర్ట్స్ బ్రా ఎలా సరిపోతుంది?

పెద్ద చెస్ట్ ఉన్న మహిళలు ఎదుర్కొనే సాధారణ స్పోర్ట్స్ బ్రా సమస్యలు బస్ట్ లీకేజ్, బ్యాక్ ఫ్యాట్ ఎక్స్పోజర్, స్ట్రాప్స్ సమస్యలు, తక్కువ సపోర్ట్ మరియు ఫిట్ లేకపోవడం. ఈ సమస్యలను నివారించడానికి, మీరు సరైన సైజు మరియు ఫిట్‌పై శ్రద్ధ వహించాలి.

బ్యాండ్ పరీక్ష

బ్రా యొక్క బ్యాండ్ మీ వెనుకభాగంలో ఖచ్చితంగా ఫ్లాట్‌గా ఉండేలా చూసుకోండి. మీరు మీ చేతులను పైకి లేపినప్పుడు, అది క్రింది నుండి పైకి కదలకూడదు. (పెద్ద బ్యాండ్ పరిమాణాన్ని ధరించినప్పుడు ఇది తరచుగా సాధారణ సమస్య.)

కప్ పరీక్ష

బస్ట్  బ్రా కప్పులను పూర్తిగా కవర్ ఐయ్యేలా ఉండాలి. బ్రా చాలా టైట్ లేదా చాలా లూస్ ఉండకూడదు. మీ బ్రా ఫిట్‌లో ఏదైనా తేడా అనిపిస్తే, ప్యాడెడ్ బ్రాను ఉపయోగించండి

స్ట్రాప్ పరీక్ష

మీ స్పోర్ట్స్ బ్రా యొక్క స్ట్రాప్స్ మీ కదలికను పరిమితం చేయకూడదు. చాలా బిగుతుగా ఉండటం, భుజాలపై ఒత్తిడి పెట్టడం మరియు తరచుగా జారడం వంటి ఇబ్బందులను నివారించడానికి రేజర్‌బ్యాక్ లేదా క్రిస్-క్రాస్ డిజైన్‌లను ఎంచుకోవడం ఉత్తమం.

మీరు పెద్ద బస్ట్  కోసం పైన పేర్కొన్న స్పోర్ట్స్ బ్రా స్టైల్‌లలో దేనినైనా ఎంచుకోవచ్చు. సరైన ఫిట్, స్వభావం, మన్నికైన ఉపయోగం, మద్దతు మరియు మొత్తం విలువ కోసం చూడవలసిన ప్రధాన విషయాలు. సరైన సైజు స్పోర్ట్స్ బ్రా ధరించడం వల్ల మీ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది.

తరచుగా అడిగే ప్రశ్నలు

పెద్ద ఛాతీ ఉన్న మహిళలు స్పోర్ట్స్ బ్రాలు ధరించవచ్చా?

పెద్ద చెస్ట్  ఉన్న మహిళలకు స్పోర్ట్స్ బ్రా ధరించడం చాలా ముఖ్యం, ఎందుకంటే ఇది వ్యాయామ సమయంలో అవసరమైన మద్దతును అందిస్తుంది. ఇది వ్యాయామం చేసేటప్పుడు ఎక్కువ సౌకర్యాన్ని అందిస్తుంది.

పెద్ద బస్ట్ కు  ఏ రకమైన బ్రా ఉత్తమమైనది?

పెద్ద బస్ట్ల కోసం వివిధ రకాల స్పోర్ట్స్ బ్రాలు ఉన్నాయి, మీడియం-ఇంపాక్ట్, హై-ఇంపాక్ట్, సీమ్‌లెస్, ప్రింటెడ్ మరియు రేసర్‌బ్యాక్‌తో ప్రారంభించి, రిమూవల్ పాడింగ్ వరకు. ఈ అన్ని శైలులు మీ వ్యాయామాల సమయంలో గొప్ప సౌకర్యాన్ని అందిస్తాయి.

పెద్ద బస్ట్ల కోసం బ్రాను ఎలా ఎంచుకోవాలి?

పెద్ద బస్ట్ల కోసం సరైన స్పోర్ట్స్ బ్రాను ఎంచుకోవడానికి బ్యాండ్, బస్ట్ మరియు కప్పు పరిమాణాలను తనిఖీ చేయండి. అలాగే, బ్రా యొక్క స్ట్రాప్స్ శరీర నిర్మాణానికి సరిగ్గా సరిపోయేలా చూసుకోండి.

పెద్ద  బస్ట్ పరిమాణం అంటే ఏమిటి?

T కప్పు లేదా అంతకంటే ఎక్కువ పరిమాణం పెద్ద రొమ్ముగా పరిగణించబడుతుంది. మీ సరైన బ్రా సైజును తెలుసుకోవడానికి, మీరు బ్రా సైజ్ చార్ట్‌ని ఉపయోగించి మీ రొమ్ము పరిమాణాన్ని కొలవాలి మరియు తదనుగుణంగా ఎంచుకోవాలి.

Sign Up for Our Newsletter

TRENDING POSTS


Style Guide
Top Must-Buy New Year Lingerie-Get Ready for 2020!
Style Guide
Top Must-Buy New Year Lingerie-Get Ready for 2020!
Style Guide
Top Must-Buy New Year Lingerie-Get Ready for 2020!