Style Guide
బ్రా ధరించకపోవడం వల్ల కలిగే నష్టాలూ గురించి మేము ముందు పోస్ట్‌లో డిస్కస్ చేసాం. ఇప్పుడు, సరిగ్గా బ్రాను ఎలా వేసుకోవాలో నేను మీకు తెలియజేయాలనుకుంటున్నాను. ఇది చిన్నవిషయంగా అనిపించవచ్చు, కానీ మన డైలీవేర్ ఇది చాలా ముఖ్యం. మీరు మీ బ్రా సరిగ్గా ధరిస్తున్నారా? లేదా మీరు కొన్నిసార్లు సరైన బ్రా సైజ్ ధరించడం వల్ల ఎందుకు అసౌకర్యంగా అనిపిస్తుందో ఎప్పుడైనా ఆలోచిస్తున్నారా? నమ్మినా నమ్మకపోయినా బ్రా ధరించడం ఒక కళ. ఇది మీ సౌకర్యంలో చాలా తేడాను కలిగిస్తుంది. మీరు కొత్తగా బ్రా ధరిస్తున్నారా, ఈ గైడ్ మీకు బ్రాను సరిగ్గా ఎలా ధరించాలో చూపుతుంది.
“సరిగ్గా బ్రాను ఎలా ధరించాలి” అనే గైడ్ కోసం క్రింద చార్ట్‌ని చూడండి.
బ్రాను సరిగ్గా ఎలా ధరించాలో తెలుసుకోవడానికి ఈ గైడ్ మీకు సహాయపడుతుందని మేము ఆశిస్తున్నాము.
ట్యాంక్ టాప్ లాగా బ్రా స్ట్రాప్స్ ద్వారా మీ చేతులను స్లైడ్ చేయండి.
మీ బస్ట్ చుట్టూ బ్రాను తీసుకురండి, తద్వారా బ్రా బ్యాండ్ బస్ట్ కింద మీ పక్కటెముకల చుట్టూ గట్టిగా ఉంటుంది. బ్రా బ్యాండ్ చాలా వరకు సపోర్ట్‌ను అందిస్తుంది కాబట్టి, బ్రా బ్యాండ్ సరిగ్గా సరిపోయేలా మరియు చాలా గట్టిగా ఉండేలా చూసుకోండి. మీకు అసౌకర్యంగా అనిపిస్తే, అది తప్పు సైజు కావచ్చు.
బ్రా వెనుక లేదా ముందు హుక్స్‌ను కలిగిఉంటుంది దానికి అనుగుణంగా బ్రా ని ధరించండి
మీ చెస్ట్ కప్పుల లోపల సరిగ్గా సరిపోయేలా చూసుకోండి. లేకపోతే, కొద్దిగా అడ్జెస్ట్ చేయండి, ప్రతి బస్ట్ పూర్తిగా కవర్ ఐయేలా కప్పుల్లోకి సరి చేయండి. ఈ విధానంలో ఎటువంటి గ్యాప్ లేకుండా మీ బస్ట్ లను బ్రా కప్పులలో సరిగ్గా ఉంచడానికి సహాయపడుతుంది.
మీ స్ట్రాప్స్ జారిపోతున్నాయా లేదా టైట్ గా ఉన్నాయా? అవి మీ భుజాల చుట్టూ సరిగ్గా సరిపోయే వరకు అడ్జెస్ట్ చేయండి.
ఇప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? అద్దం ముందు నేరుగా నిలబడి, బ్రా యొక్క మొత్తం ఫిట్‌ని చెక్ చేయండి. బ్రా మధ్యలో మీ చెస్ట్కి వ్యతిరేకంగా ఉండాలి. బ్రా బ్యాండ్ పైకి వెళ్ళకూడదు, స్ట్రాప్స్ జారిపోకూడదు మరియు బస్ట్ కప్పు లోపల ఉండేలా చూసుకోండి. ప్రతిదీ కరెక్ట్ గా ఉంది అని నిర్ధారణ చేసుకోండి